హిట్ కాంబినేషన్లో మరో భారీ బడ్జెట్ మూవీ

  • విజయ్ హీరోగా అట్లీ కుమార్ మూవీ 
  • గతంలో వచ్చిన 'తెరి' .. 'మెర్సెల్'
  • త్వరలోనే అధికారిక ప్రకటన
తమిళనాట మాస్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ కలిగిన కథానాయకుడిగా విజయ్ కనిపిస్తాడు. కథాకథనాలు .. మాటలు .. పాటలతో మాస్ ఆడియన్స్ ను అలరించేలా ఆయన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. ఇక దర్శకుడు అట్లీ కుమార్ కి మాస్ ఆడియన్స్ పల్స్ బాగా తెలుసు. ఆ విషయాన్ని విజయ్ తో ఆయన చేసిన 'తెరి' .. 'మెర్సెల్' సినిమాలు నిరూపించాయి.

అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా రానుందనేది కోలీవుడ్ టాక్. ఇంతకు ముందు ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'తెరి' .. 'మెర్సెల్' కోలీవుడ్లో భారీ విజయాలను నమోదు చేశాయి. విజయ్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల జాబితాలో ఇవి చేరిపోయాయి. హ్యాట్రిక్ హిట్ కోసం ఈ ఇద్దరూ మళ్లీ రెడీ అవుతున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారు.   
Go Back to Shorts
vijay
atlee kumar

More Telugu News